టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ లకు పెట్టింది పేరుగా జయమాలిని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ముఖ్యంగా 80 లలో ప్రతి స్టార్ హీరో కూడా తన సినిమాలలో జయమాలినితో ఒక్క పాటైనా ఉండాలని తెగ ఆరాటపడేవారు. అయితే వివాహం చేసుకొని ఆమె సెటిల్ అయిన తర్వాత కొద్ది రోజులు సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. దాంతో చిరంజీవి బ్రేక్ డాన్స్, ఫోక్ డాన్స్ అంటూ రకరకాల డాన్స్ లను ప్రవేశ పెట్టడంతో ఈమె డాన్స్ చూసేవారు కరువయ్యారు. అయినా కూడా ఈమెకు ఎక్కడా క్రేజ్ తగ్గలేదు అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయమాలిని మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తకు తనకంటే తమన్నా అంటే చాలా ఇష్టం అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే జయమాలిని ఇలా తమన్నా గురించి కామెంట్ లు చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ లో తమన్నా చేయడం బాగుందని జయమాలిని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో కృష్ణుడి పాత్రలలో నటించి ..ఆ తర్వాత మాతో కలసి డాన్స్ చేశారు అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో చిరంజీవి బాగా డాన్స్ చేసేవారు అని జయమాలిని తెలిపారు.
అలాగే మా ఆయనకు తమన్నాతో పాటు కాజల్ అంటే కూడా ఇష్టం వారి సినిమాలు వచ్చాయి అంటే ఎంత బిజీగా ఉన్నా సరే.. వారి సినిమాలు చూస్తూ ఉంటాడు. ముఖ్యంగా తమన్నా కు సెలబ్రిటీల కుటుంబాలకు చెందిన వాళ్ళల్లో కూడా అభిమానులు ఉన్నారు అంటూ తెలిపింది జయమాలిని. ఇక తమన్నా విషయానికి వస్తే.. ఇటీవల గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించినా.. ఈమెకు ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించలేదు.. ప్రస్తుతం తమన్నా చేతిలో ఉన్న అతిపెద్ద సినిమా భోళా శంకర్ మాత్రమే.. మరోపక్క హిందీ, మలయాళం భాషల్లో పలు ప్రాజెక్టులతో తమన్నా బిజీగా ఉంది. ఈ క్రమంలోని ఈమె ఒక్కో సినిమాకి సుమారుగా రూ.3కోట్ల లోపు పారితోషకం తీసుకుంటూ ఉండడం గమనార్హం.