సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంటే ఇక వారికి తిరుగులేదు అని చెప్పవచ్చు. ఇక అలా మొదటి సారి ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది కృతి శెట్టి. ఈ సినిమా తరువాత వరుసగా ఆఫర్లు వస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా నాగచైతన్య , నాగార్జున కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమాల్లో నాగచైతన్య సరసన నాగలక్ష్మి గా నటిస్తోంది. మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీని అందుకున్న ఈమె ఇప్పుడు బంగార్రాజు సినిమాల్లో కూడా మరింత ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. దీంతో పాటు మరో మూడు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.
తాజాగా లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కృతి శెట్టి. అది కూడా ఉయ్యాల జంపాలా.. మజ్ను సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించడానికి సిద్ధమయ్యారు. కేవలం అతి తక్కువ సమయంలోనే తెలుగు లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయబోతోంది అంటే కెరియర్ పరంగా సాహసం చేస్తోందేమో అని కొంత మంది అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇకపోతే బేబమ్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయడానికి సిద్ధం అయినట్టే అని అనుకుంటున్నారు..