తెలుగు ఇండస్ట్రీలోగమ్యం సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్నాడు హీరో శర్వానంద్. అలాగే సినీ రంగంలో ఇంతటి క్రేజ్ రావడానికి ఆయన నటనలే కారణమని చెప్పవచ్చు. కథల ఎంపిక విషయంలో శర్వానంద్ కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అందుకే ఇప్పుడు ఈ రేంజ్ కి వచ్చాడు.ఈ హీరో ఈ మధ్యనే వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే..అయితే భార్య పేరు రక్షిత రెడ్డి. ఈమె ప్రముఖ హైకోర్టు న్యాయవాది కూతురు అయితే త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని ప్రస్తుతం రక్షిత అమెరికాలో ఉంటూ అక్కడే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోందట.రెగ్యులర్ గా చెకప్పులకు వెళ్తుందని శర్వానంద్ కూడా అక్కడే కొంతకాలం వారికి సహాయంగా ఉండేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే వైద్యంతో పాటు అక్కడే డెలివరీతో తిరిగి హైదరాబాదుకు రానున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల విషయంలో శర్వానంద్ కానీ ఆయన ఫ్యామిలీ కానీ అధికారకంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
ఇక శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితం అనే సినిమాలో నటించగా ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందింపబడింది. ఓ ప్రముఖ నవల ఆధారంగా తన 35వ చిత్రాన్ని చేస్తున్నాడు.. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.. తెలుగు అగ్రగామి సమస్త పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తవటంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన భార్యను దగ్గరుండి చూసుకొనేందుకు శర్వానంద్ అమెరికాకు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న వార్తలపై శర్వానంద్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఒక్కసారి నిజా నిజాలు ఏంటి అనేది తెలిస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
మరి ఈ విషయంపై అటు రక్షిత ఫ్యామిలీ కానీ, శర్వానంద్ ఫ్యామిలీ కానీ స్పందిస్తారేమో చూడాలి.. ప్రస్తుతం ఈ విషయం మాత్రం శర్వానంద్ అభిమానులను తెగ ఆనందపడేలా చేస్తోంది.