తెలుగు అమ్మాయిను వివాహం చేసుకోబోతున్న శర్వానంద్…!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ఒకరైన హీరో శర్వానంద్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రస్తుతం ఈ హీరో వయసు 38 సంవత్సరాలు ఉన్నట్లు సమాచారం. ఇక అభిమానులకు కూడా శర్వానంద్ వివాహం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే శర్వానంద్ వివాహం ఎప్పుడు చేసుకుంటారని తమ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గడచిన కొద్ది రోజుల క్రితం ఆహలో అన్ స్టాపబుల్ షోకీ రావడం జరిగింది.ఈ సందర్భంగా బాలయ్య కూడా శర్వానంద్ వివాహం విషయాన్ని అడగగా అందులో దాటవేశాడు.

Sharwanand is all set to enter wedlock - JSWTV.TV

ఇక శర్వానంద్ తాజాగా తన పెళ్లి గురించి ఒక వార్త వైరల్ గా మారుతోంది .అంతేకాకుండా శర్వానంద్ వివాహం కూడా ఫిక్స్ అయిందని వధువు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివాహ ముహూర్తం ఫిక్స్ అయిందని తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయి అన్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు కోడైకొస్తున్నాయి. అయితే ఇది లవ్ మ్యారేజ్ అనే మాట కూడా ఎక్కువగా వినిపిస్తోంది.ఆ అమ్మాయి శర్వాకు చాలా కాలంగా తెలుసని ఆమె కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అన్నట్లుగా సమాచారం.

ఇక ఆ అమ్మాయి ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కారణంగా ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ లో స్టార్స్ సంగతి పక్కన పెడితే యాక్టర్ లిస్టులో శర్వాన ముందు వరుసలో ఉంటారు.మొదట చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఆ తర్వాత సినిమా కథను ఎంచుకుంటూ నటుడుగా నిరూపించుకున్నారు. ప్రస్తుతం కమర్షియల్ గా ఎదగలేకపోయినా బాగానే సక్సెస్ అవుతున్నారు శర్వానంద్. చివరిగా ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

Share.