టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారిలో దీపిక పిల్లి కూడా ఒకరు.. ఢీ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె క్రమంగా బుల్లితెర పైన పలు రకాల షోలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత కామెడీ స్టార్స్ మాటీవీలో ప్రసారమయ్యేటువంటి పలు షోలకు హోస్ట్ గా చేసింది. ఇక ఆ తర్వాత సుదీర్ తో కలిసి వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో నటించింది. తన గ్లామర్ తో ఆకట్టుకున్న దీపిక పిల్లి ఆ తర్వాత కెరియర్లో మరి సినిమాలో కూడా నటించలేదు.
దీంతో చివరికి తన కెరీర్ ని ఎక్కడ మొదలుపెట్టిందో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చి చేరింది. లేటెస్ట్ సీజన్లో మళ్లీ దీపిక ప్రత్యక్షమైంది. దీంతో సోషల్ మీడియాలో క్రేజీ షో కి ప్లస్ అవుతుందని ఆమె తీసుకున్నట్లు తెలుస్తోంది. దీపిక పిల్లికి కూడా బయట ఎక్కడ అవకాశాలు లేకపోవడంతో మల్లెమాల టిమ్ ఈ పని చేస్తూ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ అమ్మడు డి చాన్స్ రాగానే ఓకే అని చెప్పిందని తెలుస్తోంది ప్రస్తుతం తన డిమాండ్ ని తగ్గించుకొని మరి డి టమ్ లో టీమ్ లీడర్ గా చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
పలు రకాల షోలలో పోస్టుగా చేస్తున్న దీపికా పిల్లి ఫ్యాన్ ఫాలోయింగ్ గ్లామర్ పరంగా బాగానే ప్రేక్షకులను సంపాదించింది.. కానీ నటనపరంగా మెర్పించలేకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు సినిమాలలో అవకాశాలు రాలేకపోతున్నాయి. అందుచేతనే ఈ అమ్మడిని బుల్లితెరపైనే యాంకరింగ్ చేసుకుంటూ ఉండమని పలువురు నెటిజెన్లు సలహా ఇస్తున్నారు. మరి బుల్లితెర పైన మకుటం లేని మహారాణిల వెలుగుతుందేమో చూడాలి మరి. ఈ మధ్యకాలంలో బుల్లితెర పైన యాంకర్స్ హవా కూడా చాలానే తగ్గుతుంది దీంతో కొంతమంది బుల్లితెర నుంచి బయటికి వచ్చి వెండితెర పైన బాగానే అలరిస్తూ ఉన్నారు.