షాలిని పాండేని అక్కడ వాడేందుకు సిద్ధమయ్యారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అర్జున్ రెడ్డి సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన షాలిని పాండే అందరిని ఆకట్టుకుంది. కాస్త బొద్దుగా అనిపిస్తుందని లోటే తప్ప అమ్మడిని సరిగా వాడుకుంటే అదరగొట్టేస్తుంది. అర్జున్ రెడ్డిలో విజయ్ తో ఈక్వల్ రోల్ పోశించి మెప్పించిన షాలిని పాండే ఆ తర్వాత ఆ రేంజ్ విజయాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. మహానటి సినిమాలో మంచి పాత్ర దొరికింది కాని అది కెరియర్ బిల్డప్ కు ఉపయోగపడలేదు. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కూడా అలా కనిపించి ఇలా మాయమయ్యింది షాలిని పాండే.

ఇదిలాఉంటే ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతుందని తెలుస్తుంది. ఇది ఓ రకంగా షాలిని తెలుగు ఫ్యాన్స్ కు చేదు వార్తే అయినా బాలీవుడ్ క్రేజీ డైరక్టర్ కం ప్రొడ్యూసర్ అనురాగ్ కశ్యప్ సమర్పణలో బాంఫాడ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందట. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో షాలిని పాండే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ప్రస్తుతం తమిళంలో అమ్మడు 100% కాదల్ సినిమా చేస్తుంది.

ఆ సినిమాతో తన లక్ మారుతుందని భావిస్తుందని షాలిని పాండే తెలుగులో ఇక సినిమాలు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఒకవేళ క్లిక్ అయితే మాత్రం ఇక సౌత్ సినిమాలవైపు అంత ఇంట్రెస్ట్ చూపించే అవకాశం లేదు. మరి అర్జున్ రెడ్డి భామకు అక్కడైనా కెరియర్ సెట్ రైట్ అవుతుందేమో చూడాలి.

Share.