పారిపోయిన శైలజారెడ్డి అల్లుడు.. వెతుకుతున్న చిత్ర యూనిట్

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాను ఆగష్టు 31న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న దానికంటే చాలా నెమ్మదిగా సాగుతుండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. ముందుగా ప్రకటించినట్లుగా ఆగష్టు 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఒక్కాసారిగా షాక్ అయ్యారు. అయితే చిత్రాన్ని అందరికీ నచ్చేలా తీయడం కోసం చిత్ర యూనిట్ ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. అందుకే ఆలస్యమైనా చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తి చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో నాగ చైతన్య సరసన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్‌గా నటిస్తోండగా రమ్యకృష్ణా అతడి అత్తగా నటిస్తోంది. ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది చిత్ర యూనిట్ త్వరలో ప్రకటిస్తారట.

Share.