కరీనా, కరిష్మాకపూర్స్ తో గడిపిన ఆ సాయంత్రం ఎంతో ప్రత్యకం: షారుక్ ఖాన్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ నిన్న తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కరీనా కపూర్, కరిష్మా కపూర్ తో ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసారు, ప్రస్తుతం వీరు ముగ్గురు కలిసి లక్స్ నూతన యాడ్ లో నటిస్తున్నట్టు సమాచారం. అయితే షారుక్ ఈ నూతన యాడ్ లో కరీనా మరియు కరిష్మా తో కలిసి బాత్ టబ్ లో దర్శనమివ్వనున్నట్టు ఈ ఫోటో తో పాటు చేసిన ట్వీట్ ద్వారా అర్ధం అవుతుంది. షారుక్ ఖాన్ ట్వీట్ చేస్తూ ” కరీనా, కరిష్మా తో ఉన్న ఈ సాయంత్రం ఎంతో ప్రత్యకమైంది, లక్స్ సోప్ యాడ్ లో నటించటం అది కూడా బాత్ టబ్ లో నటించటం ఎప్పుడు లాభదాయకమే థాంక్స్ లక్స్ ఇండియా ” అని చిలిపిగా ట్వీట్ చేసారు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ”
ప్రస్తుతం షారుక్ ఖాన్ ‘ జీరో ‘ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ మరి కొద్దీ నెలల్లో ముగియనుంది. జీరో సినిమా ఈ సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు.

Share.