బాలీవుడ్ టాప్ హీరో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే షాహిద్ కపూర్ బాలీవుడ్ లైఫ్ అనే ఒక మీడియాతో మాట్లాడుతూ.. తాను కబీర్ సింగ్ సినిమా విడుదల అయిన తరువాత హలో నిర్మాత దగ్గరకు రోజు వెళ్ళాను అని తెలిపారు. ఆ దర్శక నిర్మాతలు అందరూ కూడా 200 నుంచి 250 కోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మించే పెద్ద నిర్మాతలు తెలిపారు షాహిద్.
కానీ తాను గతంలో అటువంటి పెద్ద పెద్ద సినిమాల బడ్జెట్ క్లబ్ లోకి చేరలేదని, కానీ ప్రస్తుతం జెర్సీ సినిమాతో ఆ ఫీట్ సాధించడంతో అది చాలా కొత్తగా అనిపిస్తుంది అని తెలిపారు.సినీ ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15,16 ఏళ్లు అవుతున్న కూడా భారీ బడ్జెట్ మూవీ చేయలేదని తెలిపారు షాహిద్. చివరికి ఇలా సాధ్యమైందని తెలిపాడు. ఇది ఎక్కడివరకు వెళుతుందో తెలియదని కానీ తనకు చాలా కొత్తగా ఉందని చెప్పుకొచ్చాడు.