సిరివెన్నెల మృతిపై మహేష్ బాబు ట్వీట్ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. నిమోనియా తో బాధపడుతున్న సిరివెన్నెల ఈనెల 24వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నవంబరు 30వ తేదీన హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. అయితే సిరివెన్నెల మృతిపై సినీ ఇండస్ట్రీ లో ఉండే ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించడం జరిగింది. సాహిత్య మేధావి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కోల్పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు ప్రార్థనలు ఆయన కుటుంబంతో ఉన్నాయి. రెస్ట్ ఇన్ పీస్ సార్ అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది. మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది లో విడుదల కానుంది.

Share.