స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆహారపు అలవాట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎన్నో కథనాల రూపంలో ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి మీడియాతో వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులుగా ఉండే వారిలో ఇమంది రామారావు కూడా ఒకరు. ఒకసారి ఏదైనా వింటే ఇట్టే గుర్తు పెట్టుకునే వారిలో సీనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉంటారు అంటూ ఇమంది రామారావు వెల్లడించారు..
ఏదైనా సీరియస్ గా మాట్లాడుతున్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. ఎన్టీఆర్ కి అసలు నచ్చేది కాదు అని ఇష్టానుసారంగా కూర్చున్నా కూడా ఎన్టీఆర్ కి నచ్చదని ఇమందిరామారావు తెలిపారు. ముఖ్యంగా ఆయన బయటకు వెళ్లిన ప్రతిసారి ఆయన భార్య బసవతారకం ఎదురు వచ్చేవారు అని ఎన్టీఆర్ ఇలాంటి సెంటిమెంట్లను కచ్చితంగా ఫాలో అయ్యే వారని ఇమంది రామారావు తెలిపారు. తమ్ముడు అంటే ప్రేమాభిమానాలు ఎక్కువ అని తెలిపిన ఇమంది రామారావు ఆయన ఆహారపు అలవాట్ల గురించి కూడా వెల్లడించారు.
ఎన్టీఆర్ కి కౌజు పిట్టల మాంసం, చికెన్, మటన్ ,చేపలు అన్నీ తినేవారని ఆయన వెల్లడించారు. తిండి పెడుతుంటే తింటూనే ఉండేవారు అని ఇమందిరామారావు తెలిపడం జరిగింది. ముఖ్యంగా అట్లు, అరకేజీ జిలేబీలు , బజ్జీలు ఒకే సమయంలో తినేవారని ఆయన కామెంట్లు చేశారు . అంతేకాదు పని కూడా ఎవరు చేయలేని విధంగా చేసే వారిని కామెంట్లు చేశారు. ఇకపోతే 40 సంవత్సరాల క్రితమే ఎనిమిది లక్షల రూపాయల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఒక సినిమా సమయంలో ఎన్టీఆర్ 29 కూల్ డ్రింక్స్ తాగారని, 10 ప్యాకెట్ల సిగరెట్లు కాల్చారు అని ఒక సీను కోసం అలా చేయాల్సి వచ్చిందని ఇమందిరామారావు తెలిపారు. ఇకపోతే ఎన్టీఆర్ గురించి ఈయన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.