టాలీవుడ్ లో అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ మోసం చేసి పలువురు సెలబ్రిటీల దగ్గరనుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినా వ్యాపారవేత్త శిల్ప చౌదరిని అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఆమె చేతిలో మోసపోయిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ బాధను వినిపిస్తున్నారు. ఇప్పటికే హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని శిల్పా పై ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కిట్టి పార్టీ పేరుతో తన దగ్గర నుంచి మూడు కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసింది అంటూ ప్రియదర్శిని పోలీస్ లనుఆశ్రయించింది .
అయితే తాజాగా శిల్పా చేతిలో మోసపోయిన టాలీవుడ్ హీరో బయటకు వచ్చాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు హర్ష్ కనుమిల్లి.ఈ యంగ్ హీరోకి శిల్ప కిట్టి పార్టీ పేరుతో మాయమాటలు చెప్పి అతని దగ్గర నుంచి మూడు కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా తనని ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఆ యంగ్ హీరో పోలీసులను ఆశించినట్టు తెలుస్తోంది. ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు, ఈమె చేతిలో మోసపోయిన వారు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు.