తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్ గా విలన్ గా హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కలర్ ఫోటో హీరో సుహాస్. ఇండస్ట్రీలో నెమ్మదిగా ఎదుగుతూ ఎంతో బిజీగా మారిపోయారు ఈ నటుడు. హీరోగా మంచి అవకాశాలు అందుకున్నప్పటికీ ఈయన మాత్రం విలన్ పాత్రలలో నటిస్తే సందడి చేస్తున్నారు. ఇక కలర్ ఫోటో ద్వారా మంచి పేరు సంపాదించిన సుహాస్.. రైటర్ పద్మభూషణం సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాస్ తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తాను ప్రేమించి వివాహం చేసుకున్నానని అయితే తన పెళ్లి విషయం కనీసం స్నేహితులకు కూడా తెలియజేయలేదని తెలిపారు సుహాస్. పెళ్లి చేసుకున్న తర్వాత తన సినీ కెరియర్లో మంచి అవకాశాలు వచ్చాయని తెలిపారు. తాజాగా ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా సిరీస్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాను తాను ఒక సైకోగా నటించడంతో తన భార్య చాలా భయపడిందని ఆ పాత్రలో నన్ను చూసి మూడు రోజులపాటు ఇంటికి కూడా రానివ్వకుండా ఆఫీసులోనే పడుకోమని చెప్పిందట.
ఈ సిరీస్ విడుదలైన తర్వాత నేను ఇంట్లో నార్మల్ గా నవ్వినా కూడా తను భయపడేదని తెలియజేశారు సుహాస్. ప్రస్తుతం సుహాస్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సుహాసి నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణం ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది మరి సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.