కత్రినా కైఫ్ కోసం అమితాబ్ ఎం చేసారో చూడండి, వైరల్ వీడియో

Google+ Pinterest LinkedIn Tumblr +

అమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ” తగ్స్ అఫ్ హిందుస్థాన్ “. ఈ సినిమా ట్రైలర్ ని నిన్న అధికారికంగా విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ వేదిక పై ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ట్రైలర్ విడుదల చేసిన తర్వాత హీరో హీరోయిన్లు అందరూ వేదిక పైకి మాట్లాడటానికి వస్తున్న సమయంలో అందరు ఒక్కసారిగా కత్రినా చెప్పిన దానితో అవాక్కయ్యారు.

ఇంతకీ విషయం ఏంటంటే కత్రినా పెట్టుకున్న ఒక ఇయర్ రింగ్ కి ఉన్న స్క్రూ ఊడిపోయి ఎక్కడో పడిపోయింది. ఇది తెలుసుకున్న నటుడు అమిర్ ఖాన్ స్టేజి పై కత్రినా ఇయర్ రింగ్ వెతికే పనిలో బిజీ అయిపోయారు. ఇంతలో స్టేజి పైకి అమితాబ్ బచ్చన్ చేరుకొని ఇయర్ రింగ్ కి ఉన్న స్క్రూ వెతకటం ప్రారంభించారు, ఇది చూసిన కత్రినా అమితాబ్ ని వద్దన్నట్టుగా చెప్పింది అయినా సరే అమితాబ్ వినకుండా అదే పనిగా వెతకటం మనం వీడియో లో చూడవచ్చు. ఇక కొద్దీ సేపటి తర్వాత మూవీ టీం లోని సభ్యుడు ఒకరు వచ్చి కత్రినా కి స్క్రూ ఇవ్వగా ఆమె అది ధరించిన తర్వాత అందరు కలిసి ఫొటోలకి ఫోజులు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్ లో వైరల్ గా మారింది.

Share.