స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు లోనే కాకుండా సౌత్ ఇండియా అంతటా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే, ముఖ్యంగా బన్నీ కి కర్ణాటక లో చాల క్రేజ్ ఉంది. అల్లు అర్జున్, బోయపాటి కాంబో లో వచ్చిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రం తెలుగులో మంచి హిట్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులని ఈ చిత్రం బాగా ఆకట్టుకుంది. విడుదలై సుమారు రెండు సంవత్సరాలైనా ఈ సినిమా ఇంకా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా ‘సరైనోడు’ సినిమాని హిందీ లోకి డబ్ చేయగా యూట్యూబ్ లో సుమారు 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది ఈ సినిమా.
ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రాన్ని కూడా యుట్యూబ్ లో ఇంత మంది ప్రేక్షకులు వీక్షించలేదు. బన్నీ ‘సరైనోడు’ భారతీయ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకోవటంతో చిత్ర యూనిట్ మరియు హిందీ వెర్షన్ యూట్యూబ్ రైట్స్ ని సొంతం చేసుకున్న గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్ సంస్థ వారు ఆనందం వ్యక్తం చేసారు. 2016 లో విడుదలైన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కాథరిన్ థెరెసా హీరోయిన్లుగా నటించగా, అది పినిశెట్టి విలన్ గా నటించారు. హీరో శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు.
భారతీయ సినీ చరిత్రలో ఒకే ఒక్కడు
Share.