ఒక్కసారిగా సైలెంట్ అయిన సంయుక్త మీనన్.. కారణం కుటుంబ సభ్యులేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కూడా ఒకరు. మొదట ఈమె పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార చిత్రంతో మరింత పాపులారిటీ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ధనుష్ తో కలిసి సార్.. సాయి ధరంతేజ్ తో విరూపాక్ష వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.

Samyuktha Menon disappointed with Bheemla Nayak..? - TeluguBulletin.com

అయితే ఇప్పుడు మళ్లీ కళ్యాణ్ రామ్ తో కలిసి డేవిడ్ సినిమాలో నటిస్తున్నది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం వంటి భాషలలో కూడా నటిస్తూ పలు చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే జంగా అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో ఈమె పేరు ఈ మధ్యకాలంలో సరిగ్గా వినిపించలేదు..అయితే ఒకేసారి ఇండస్ట్రీలో తన పేరు మంచి పాపులారిటీగా తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సైలెంట్ గా ఉండడంతో పలు కారణాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సంయుక్త మీనన్ కుటుంబంలో కొన్ని పర్సనల్ విషయాలలో ఇబ్బంది పడుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఈమె ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించడం లేదని చాలామంది భావిస్తున్నారు. మరి కొంతమంది ఒక నిర్మాత అవకాశం ఇస్తానని చెప్పి మధ్యలో మరొకరిని పెట్టి హీరోయిన్గా తీసుకున్నారని ఈ కారణం చేత కాస్త డిస్టర్బ్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

సంయుక్త కి సంబంధించి కొన్ని రూమర్స్ అయితే వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం సంయుక్త సైలెంట్ అవ్వడంతో ఈమె అభిమానులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.మరి తిరిగి వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తుందేమో చూడాలి మరి సంయుక్త మీనన్.

Share.