తెలుగు చలనచిత్ర సినిమా ను జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన శంకరాభరణం చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పూర్ణోదయ పిక్చర్స్ వాళ్లు ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చినప్పుడు పెద్ద హీరోలు ఎవరూ ముందుకు రాలేదు.. ఈ క్రమంలోని ఏడిద నాగేశ్వరరావు స్నేహితుడు అప్పటి డిప్యూటీ కలెక్టర్ గా గుర్తింపు పొందిన సోమయాజుల ను ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించడానికి ఎన్నుకున్నారు.. ఈ సినిమాలో వ్యాంప్ పాత్ర చేయడానికి మంజుభార్గవి ని తీసుకున్నారు. ఈమెను తీసుకోవడం వెనుక తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
మాటల రచయితగా జంధ్యాలగారు పనిచేశారు.సంగీతం లేని శంకరాభరణం సినిమాను ఊహించలేము కాబట్టి మొదటి నుంచి చివరి వరకు పాటలు కావచ్చు లేదా నేపధ్య సంగీతం కావచ్చు కె.వి.మహదేవన్ చేసిన ప్రయత్నం అమోఘం అని చెప్పాలి. కథ వినగానే పులకరించిన వేటూరి సుందర మూర్తి వెంటనే శంకరా నాదశరీరాపరా.. జీవేశ్వరా..! అని ఈ పాట రాయడం మొదలుపెట్టారు.. ఇది పూర్తయిన తర్వాత కె.వి.మహదేవన్ బాణీ కట్టడం జరిగింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం తన సినీ ప్రయాణంలో శంకరాభరణం సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
1980 ఫిబ్రవరి రెండో తేదీన విడుదలైన ఈ చిత్రం పై హీరోలు ఎవరూ లేకపోవడంతో చాలా మంది తక్కువ అంచనా వేశారు.. చూడడానికి కూడా ఎవరు వెళ్ళలేదు.. కానీ కె.విశ్వనాథ్ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ తీసిన పద్దతి బాగా ఉండటంతో కొంత మంది ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి చెప్పులు బయట విడిచి , సినిమా థియేటర్ లోకి వెళ్ళడం మొదలు పెట్టారు.