నేను ప్రగ్నెంట్ ని, భారత్ -పాక్ మ్యాచ్ పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన సానియా మీర్జా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. యావత్ క్రికెట్ ప్రపంచం అంత ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మ్యాచ్ ఇది. ఇక ఈ మ్యాచ్ పై ప్రముఖ భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన ట్విట్టర్ ద్వారా ఈ విధంగా స్పందించారు ” ఈ మ్యాచ్ జరగటానికి ఇంకా కేవలం 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది…కొద్ది రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే సోషల్ మీడియా లో ఈ మ్యాచ్ పై వచ్చే అనేక వార్తలు, మరియు నాన్సెన్స్ నుండి కొంతైనా ఉపశమనం కలుగుతుంది. ఈ మ్యాచ్ మాములు మనిషికి కూడా ఆరోగ్య సమస్యలు తెచ్చి పెట్టవచ్చు. ఇక నేను ప్రస్తుతం గర్భవతిని నేను కూడా ఈ నాన్సెన్స్ కి దూరంగా ఉండాలని అనుకుంటున్నా.

ఈ మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరికి నా మనవి “ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ దాన్ని అదే కోణంలో చూడండి” అని ట్వీట్ చేసారు. సానియా మీర్జా ప్రముఖ పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Share.