ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప సినిమా హంగామానే కనిపిస్తోంది. సినిమా టాక్ ఎలా ఉన్నా సరే వసూళ్లు మాత్రం బీభత్సంగా వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలోని పాటలతో సెలబ్రెటీలు కూడా రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఆ లిస్టులో ఆర్ఎక్స్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది. ఆమె పుష్ప సినిమాలోని సామి సామి అనే పాటకు బీచ్ దగ్గర డాన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. పుష్ప సినిమాలో సూపర్ హిట్ సాంగ్ లో సామి సాంగ్ కూడా ఒకటి..
ఈ పాటను తెలుగు వర్షన్ లో మౌనిక పాడినా..తమిళ వర్షన్ లో రాజ్యలక్ష్మి పాడారు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తమిళ వెర్షన్ కు సాంగ్ డాన్స్ చేసి ఇంస్టాగ్రామ్ రీల్స్ లో పెట్టడంతో ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారుతోంది.. అంతేకాదు ఈ పాట తనకు చాలా నచ్చిందని స్టేటస్ పెడుతూ.. ఈ సాంగు కాలు కదిపి డాన్స్ చేసింది పాయల్ రాజ్ పుత్. ఈ పాట చూసిన ప్రేక్షకులు అంత బాగా ఎట్రాక్ట్ అవడంతో పాటు చాలా బాగా చేసింది అంటూ ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.