మళ్లీ తల్లి అవుతున్న ఎన్టీఆర్ బ్యూటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సమానంగా డ్యాన్స్ వేయగల హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ఓ ముద్ర వేయించుకున్న ఒకప్పటి హీరోయిన్ సమీరా రెడ్డి ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. పెళ్లి తరువాత ప్రెగ్నెన్సీ.. అటుపై కొడుకు పుట్టడంతో ఈ భామ దాదాపు సినిమాలు చేయడం పూర్తిగా మానేసింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ మరోసారి తల్లి కాబోతుంది.

సమీరా రెడ్డి తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేస్తూ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. దీంతో ఆమె రెండో సారి తల్లి కాబోతుందనే విషయం స్పష్టం అయ్యింది. అయితే తాను చాలా సంతోషంగా ఉందని.. మళ్లీ తల్లి అవుతుండటం నిజంగా ఒక మంచి ఫీలింగ్‌ను కలిగిస్తుంది అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఆమె ఓ స్విమ్ సూట్‌లో పూల్‌లో ఈత కొడుతూ కనిపించింది.

ఇక తన పర్సనల్ లైఫ్ హ్యాపీగా సాగుతుందని.. పుట్టబోయే బిడ్డ కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నానంటూ సమీర సంతోషం వ్యక్తం చేసింది. ఏదేమైనా సమీరా రెడ్డి మరోసారి తల్లి కానుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share.