సమంత యూ టర్న్ ‘ది కర్మ ‘ థీమ్ సాంగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

సమంత, రాహుల్ రవీంద్రన్, అది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ యూ టర్న్ ‘. దర్శకుడు పవన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ మరియు పోస్టర్స్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కన్నడ హిట్ సినిమా ” యూ టర్న్ ‘ కి రీమేక్ గా వస్తుంది. ఇక ఈ రోజు చిత్ర యూనిట్ ఈ సినిమాలోని ” కర్మ ” అనే థీమ్ సాంగ్ ని అభిమానుల కోసం విడుదల చేసారు. సాంగ్ చూస్తుంటే సినిమా పై అంచనాలు ఇంకాస్త పెరిగాయి అని చెప్పవచ్చు. ఈ సొగ్ ని అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేయటం విశేషం.

ప్రముఖ నటి భూమిక చావ్లా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. పూర్ణ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 13 వ తేదీన విడుదల కానుంది. శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని బీ ఆర్ 8 క్రియేషన్స్ , వీ వై కంబైన్స్ , శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

 

Share.