నటి సమంత మరో కొత్త అవతారం లో అభిమానులకి దర్శనమిచ్చారు. మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సమంత తనకి నచ్చిన కథలను ఎంపిక చేసుకుని నటిస్తుంది. ఇక నిన్న చెన్నై జామ్ బజార్ లో కూరగాయలు అమ్ముకుంటూ కనిపించరు సామ్. ఇది అంత తన నూతన సినిమా కోసం కాదండోయ్, మరి దేనికని అనుకుంటున్నారా..అయితే ఇది చదవండి.
ప్రత్యుష చారిటబుల్ ట్రస్ట్ గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న సంస్థ, అనాధ పిల్లలకి, వృద్ధ మహిళలకి, ఎంతో మంది చిన్నారుల చదువులకి ఈ సంస్థ అనేక విధాలుగా సహాయ పడుతూనే ఉంది. అనేక మంది ప్రముఖులు కూడా ప్రత్యుష చారిటబుల్ ట్రస్ట్ కి వారికి తోచిన సహాయం కానీ, విరాళం కానీ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా నటి సమంత చెన్నై లో కూరగాయలు అమ్ముతూ దాని ద్వారా వచ్చిన డబ్బుని ఈ సేవ సంస్థ కి విరాళం గా ఇవ్వాలని భావించారట. అనుకున్న విధంగానే జామ్ బజార్ లో కూరగాయలు అమ్మే మహిళా గా మారిపోయారు సామ్, ఒక్క సరిగా ఆమెని చూసే సరికి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని, తమ అభిమాన నటి అమ్ముతున్న కూరగాయాలని ఎంత ధర అయినా పర్వాలేదని చెప్పి కొన్నారట. ఎంతో మంది పేద వారికి, చదువుకోలేని పిల్లలకి ఈ డబ్బు ఉపయోగ పడనుంది, అందుకే నేను ఈ మంచి పని చేశాను, ఇక ఈ డబ్బుని మొత్తం ప్రత్యుష చారిటబుల్ ట్రస్ట్ కి త్వరలో అందచేయనుంది సమంత.
ప్రస్తుతం సమంత తన తదుపరి చిత్రం ‘ యూ టర్న్ ‘ చిత్ర ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13 వ తేదీన విడుదల కానుంది.