టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోని రెండవ పెళ్లికి సిద్ధమయింది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ,నాగచైతన్య ప్రేమించుకొని మరి వివాహం చేసుకొని విడిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉంటూ తమ కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సమంత రెండో వివాహం చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
చైతన్య తో విడిపోయినప్పటి నుంచి ఈ విషయం చాలా వైరల్ గా మారుతూనే ఉంది. ఇంతకీ సమంత వివాహం చేసుకోబోయే వరుడు ఎవరో కాదు.. విజయ్ దేవరకొండ. అయితే ఈ పెళ్లి రియల్ లైఫ్ లో కాదంట రీల్ లైఫ్ లో అన్నట్లుగా సమాచారం. సమంత ,విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో సమాంత మెడలో పోతాలి బొట్టుతో కనిపించబోతోంది ఈ సినిమాలో సమంత పెళ్లయిన యువతీ పాత్ర చేస్తున్నారంట అంతేకాకుండా విజయ్ దేవరకొండ, సమంత పెళ్లి సీన్స్ ఉన్నట్లుగా సమాచారం.
ఇక సమంత రియల్ లైఫ్ లో విడాకులు ఇచ్చి రీల్ లైఫ్ లో పెళ్లి పీటలు లేకపోతోంది అంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మరి సమంత కూడా నిజజీవితంలో రెండవ వివాహం చేసుకోబోతోందా అనే అనుమానాలకు కూడా దారి తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నాగచైతన్య కూడా మరొక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. గతంలో విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ లో ఉన్నట్లు ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.