Samantha: ఫ్యాన్స్ చేసిన పనికి ఎమోషనల్ అయిన సమంత..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Samantha:టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత(Samantha ) కూడ ఒకరు. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సమంత అందానికి అభిమానులు ఫిదా అయిపోవాల్సిందే. ఇటీవల యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది సమంత. అయితే శాకుంతలం సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా..కానీ కాస్త లేటుగా రిలీజ్ కి సిద్ధమవుతోంది.ఇలా ఈ మధ్యకాలంలో సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

Samantha (@Samanthaprabhu2) / Twitter

సమంత అనారోగ్యానికి గురైనప్పటినుంచి ఆమెపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు ఆమె అభిమానులు. అభిమానులే కాదు సమంత కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. సమంత నటించిన పలు చిత్రాలు ఆమెకు మంచి విజయాన్ని అందజేశాయి. అయితే ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసాయి.

Samantha (@Samanthaprabhu2) / Twitter

అయితే ఇటీవల సమంత ఓ షూటింగ్లో గాయాలపాలైన విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అందులో సమంత చేతికి గాయాలు అయ్యాయి. సమంత ఆ ఫోటోను చూసిన అభిమానులంతా ఆందోళన పడ్డారు. అయితే తాజాగా సమంత ఫ్యాన్ సమంతకు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. అదేమిటంటే సమంత చేతి గాయాలను బొమ్మగా గీసింది.. ఆమె గీసిన ఆ బొమ్మను షేర్ చేస్తూ నేను మీ సక్సెస్ కి మాత్రమే ఫ్యాన్లు కాదు. మీ హార్డ్ వర్క్ కూడా మంచి ఫ్యాన్ ని అంటూ ఈ చిత్రాన్ని మీకు అందిస్తున్నానంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. కచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది. అనుకుంటున్నా అనిరాసుకొచ్చింది. ఈ పోస్టుకు సమంత రియాక్ట్ అవుతూ థాంక్యూ మై లవ్.. అని మెసేజ్ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by SruSam ❤️ (@srusam3)

Share.