ప్రముఖ నటి త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన తమిళ చిత్రం ” 96 ” విడుదలైన అన్ని ప్రాంతాల్లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ సినిమాలో త్రిష నటనకి అన్ని వైపులా నుండి ప్రశంసల జల్లు కురుస్తుంది. త్రిష కనబరచిన అద్భుతమైన నటనకి అన్ని వర్గాల ప్రజలు ఈ సినిమాలో ఆమెతో ప్రేమలో పడిపోవటం ఖాయం.
అయితే గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొద్దీ రోజుల కిందట నిర్మాత దిల్ రాజు ఈ సినిమా తెలుగు రైట్స్ సొంతం చేసుకోవటంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. ఇక తాజాగా ట్విట్టర్ లో ఒక అభిమాని సమంతని మీరు ” 96 తెలుగు రీమేక్ లో త్రిష పాత్ర చేయనున్నారని వార్తలు వస్తున్నాయి, ఇది నిజమేనా అని అడగ్గా..
ఆ ప్రశ్నకి సమంత రిప్లై చేస్తూ ” ఆ సినిమా రీమేక్ చేయకూడదు ” అని సమాధానం ఇచ్చారు.
Shouldn’t be remade 😊 https://t.co/1ia5GhtvSr
— Samantha Akkineni (@Samanthaprabhu2) October 17, 2018