తన డ్రెస్ పై కామెంట్ చేసిన వారికీ సమంత స్ట్రాంగ్ కౌంటర్

Google+ Pinterest LinkedIn Tumblr +

నటి సమంత ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి హాలిడే లో ఉన్నారు. వీరిద్దరూ తమ స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా నిన్న హాలిడే లోని ఫోటలని షేర్ చేసారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ సమంత షేర్ చేసిన ఫోటోలు కొంచం శృతి మించాయని నెటిజన్స్ ఆమె పై సోషల్ మీడియా లో ఫైర్ అయ్యారు. ఆమె ధరించిన దుస్తుల పై కొంత మంది తీవ్రంగా విరుచుకు పడ్డారు. పెళ్లి తర్వాత ఇటువంటి చిన్న చిన్న వస్త్రాలు ధరించటం ఏంటని, కనీసం పబ్లిక్ లో ఉన్నప్పుడైనా మంచి దుస్తులు ధరించు..కొంత మంది త్వరగా ఈ ఫోటోని మీ ఇన్ స్టాగ్రామ్ నుండి తొలగించండి…అంటూ ఎవరికీ తోచినట్లు వారు కామెంట్లు చేసారు.

ఇక ఈ రోజు సమంత తన అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ నుండి వారందరికీ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు.
ఆమె తీవ్ర స్థాయిలో తన డ్రెస్ గురించి కామెంట్లు చేసిన వారిపై విరుచుకు పడ్డారు. ఒకే ఒక్క పోస్ట్ తో వారందరికీ సమాధానం చెప్పారు. సమంత పోస్ట్ చేస్తూ ” నా పెళ్లి తర్వాత నేను ఎలా ఉండాలో చెబుతున్న వారందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే అదేంటంటే అంటూ ” ఒక ******** వేలుని చూపించారు” తర్వాత ధన్యవాదాలు అని మరో పోస్ట్ పెట్టారు. సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది.

 

Share.