Samantha..టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు పొందిదీ హీరోయిన్ సమంత(Samantha). ఈమె నటించిన పలు చిత్రాలతో క్రేజీ ను సంపాదించుకుంది. గత ఏడాది యశోద సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈసారి శాకుంతలం సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయింది కానీ… ఇంకా విడుదలకు సిద్ధం కాలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో చిన్నప్పటి శాకుంతలం పాత్రలో అల్లు అర్జున్ కూతురు అర్హ నటిస్తోంది.
ఈ సినిమాలో నటించిన గెస్ట్ అల్లు అర్హ గురించి సమంత చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోతారు. తను చాలా క్యూట్ గా ఉంటుందని.. అసలు తను తెలుగు చాలా బాగా మాట్లాడుతుందని చెప్పుకొచ్చింది. ఇంతకూ తనకు తెలుగు భాష అంత స్పష్టంగా రావడానికి తన పేరెంట్స్ కారణమని.. అలా పిలిచినందుకు స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ కు హ్యాండ్సప్ అంటు అల్లు అర్హ న్ని పొగడ్తలతో ముంచేస్తోంది సమంత.
ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్ర పోషించారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నీలిమ గుణ సంయుక్తంగా నిర్మించారు. నిజానికి ఇది ఒక సినిమా దృశ్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తూ ఉన్నారు ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలో నటించారు.
ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ.. సినిమా ప్రమోషన్ మాత్రం స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా సమంత యాంకర్ సుమతో ముచ్చటించారు. సుమ గారితో సమంత సినిమా ముచ్చట్లను చెప్పుకొచ్చారు సినిమాను ఎందుకు ఒప్పుకున్నారో.. సినిమా గురించి మొత్తం చెప్పడం జరిగింది.. ఇక తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను మళ్లీ చెప్పుకొచ్చింది సమంత. అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోని చూసి అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. మరి శాకుంతలం సినిమా సమంత కెరీర్ని మారుస్తుందేమో చూడాలి మరి.