టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ గుణశేఖర్.. ఈయన ఇప్పుడు శాకుంతలం సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలనుకుంటున్నాడు. ఇక ఎంతో కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నాడు.ఈ సినిమాలో సమంత సరసన మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా చిన్నప్పటి సమంత పాత్ర పోషించనుంది. ఈ సినిమాను గత ఏడాదిలో విడుదల చేస్తారు అనుకుంటే వివిధ కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
అయితే ఈ సినిమాని రిలీజ్ చేయటానికి పెద్దగా సినిమాల హడావిడి లేని టైంలో విడుదల చేస్తే బెటర్ అని దిల్ రాజు సలహా ఇచ్చారట. ఆయన సలహా మేరకు గుణశేఖర్ నెమ్మదిగా సినిమాని పూర్తి చేసుకుంటూ వచ్చాడు. ఇక ఈ సినిమా పనులు తుది దశలో ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తవుతాయి.ఇక ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాలి అని గుణశేఖర్ ప్రాణాలికలు రచిస్తున్నాడు. మొత్తానికి విడుదల డేట్ క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయటానికి సన్నాహాలు సిద్ధమవుతున్నాయి.
ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు మణిశర్మ అందించనున్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు సమర్పకుడిగా ఉన్నాడు. గుణశేఖర్ తీసిన ఒక్కడు, రుద్రమదేవి ,చూడాలని ఉంది. ఈ సినిమాలు ఆయనకు ఎంత పెద్ద సక్సెస్ ని అందించాయో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయనకి కొన్ని సినిమాలు పరాజయాన్ని మిగిలించాయని చెప్పాలి. ఇక ఈ సినిమా అయినా తనని లైఫ్ టైమ్ లోకి తెస్తుందో లేదో వెయిట్ చేయాల్సిందే.