హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. సమంత సెకండ్ హ్యాండ్ ఐటెం అంటూ ట్రోల్ చేసిన ఒక నెటిజన్ కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది సమంత.”భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా” అని సదరు నెటిజన్లకు రిప్లై ఇచ్చింది సమంత. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్లో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక యూట్యూబ్లో ఈ పాట ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇక అందుకు సంబంధించి ఒక వ్యక్తి ట్వీట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఇక ఈ విషయంపై మరొక వ్యక్తి సమంత సెకండ్ హ్యాండ్ ఐటమ్..జెంటిల్‌మ్యాన్ నుంచి రూ.50 కోట్లు రూపాయలు తీసుకుంది’ అని రాసుకొచ్చాడు. ఆ నెటిజన్ ట్వీట్‌కి సమంత పైవిధంగా స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సమంతకు మద్దతుగా నిలిచారు. ‘నువ్వు ఎందుకూ పనికిరాని ఫస్ట్ హ్యాండ్ ఐటమ్’ అంటూ నటుడు బ్రహ్మాజీ సదరు నెటిజన్‌కు రిప్లై ఇచ్చారు.
Kamarali Dukandar God bless your soul . https://t.co/IqA1feO9K1
— Samantha (@Samanthaprabhu2) December 21, 2021