సమంత ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో తన ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈమధ్య చికిత్స కోసం దక్షిణ కొరియాకు వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. కానీ సమంత మాత్రం హైదరాబాదులోని తన ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు సమంత బయటకు వచ్చి సినిమా షూటింగ్లో పాల్గొనే పరిస్థితి లేనట్లుగా తెలుస్తోంది. అందుకే సమంత కొత్త సినిమాలు ఏవి ఒప్పుకోవడం లేదని కేవలం తన ఒప్పుకున్న ఖుషి సినిమాను మాత్రమే పూర్తి చేయబోతున్నట్లు సమాచారం.
అయితే సమంత పూర్తిగా కోలుకున్న కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటుందట. ఇక అందుకోసం జనవరిలో ఖుషి సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సమంత తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఒక యుద్ధం మాత్రం చేస్తోందని చెప్పవచ్చు. తాజాగా నటుడు రాహుల్ రవీంద్ర ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎంతటి సమస్యలు వచ్చినా కూడా నువ్వు పోరాడుతూనే ఉన్నావ్ ..ఇంకా పోరాడుతూనే ఉంటావ్.. ఎందుకంటే నువ్వు ఉక్కు మహిళవి..నిన్ను ఏది ఓడించలేదు.. బాధ పెట్టలేదు.. పైగా అవన్నీ నిన్ను మరింత స్ట్రాంగ్ గా చేస్తూ ఉంటాయని రాహుల్ రవీంద్రన్ తెలియజేశారు.దీనిపై సమంత రిప్లై ఇస్తూ..
థాంక్యూ రాహుల్ అని ఎమోషనల్ అయింది సమంత. బయట ఎవరైతే తమ జీవితాలతో పోరాడుతున్నారో వారందరికీ కేవలం ఒక్కటే చెబుతున్నాను.. పోరాడుతూనే ఉండండి ఇంకా మీరు బలంగా తయారవుతారు. ఇది దృఢంగా మారి కష్టాలను ఎదుర్కోవడానికి చాలా సహాయపడుతుందని సమంత తెలియజేశారు. ప్రస్తుతం సమంత కు సంబంధించి ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో పలువురు అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram