టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ పొజిషన్లో ఉన్న అమ్మడు సమంత ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దకాలం దాటుతున్న ఆమె క్రేజ్ మాత్రం కాస్తంత కూడా తగ్గలేదు. తన అందం తన అద్భుతమైన నటన తనకి అంతటి ప్రతిభ ఉండటం వల్లే ఆమె ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గానే కొనసాగుతోంది.
అయితే ఈ మధ్యనే సమంత తాత్కాలిక విరామం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.. ఎందుకంటే ఈమె రీసెంట్ గానే మావోసైటిస్ అనే వ్యాధితో బాధపడి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకునేందుకు వెళ్ళింది. అందుకోసమే సినిమాలకు కాస్త దూరంగా ఉంతోందీ సమంత.ఇకపోతే సమంత ఎన్నో వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.
అంతేకాకుండా ఇప్పుడు ఒక హాలీవుడ్ మూవీకి ప్రమోషన్స్ చేయబోతోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి ది మార్వెల్స్ అని చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకులం ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ కి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.గతంలో ఈమె కెప్టెన్ మార్వెల్ సినిమాకి కూడా ప్రమోటర్ గా నిలిచింది. అందుకని హాలీవుడ్ సమస్త ఆమె పేరును గుర్తించి తమ సినిమాకి ఈమె మాత్రమే తెలుగులో హైప్ తీసుకొని రాగలదని నమ్మటంతో సమంతకి ఎంతటి ఇమేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే రీసెంట్గా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిపోర్టర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఒక రిపోర్టర్ మాట్లాడుతూ తెలుగులో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఒక హీరోని ఎంచుకోమంటే మీరు ఎవరిని ఎంచుకుంటారు అని అడగ్గా దానికి సమంతా ఇలా సమాధానం ఇచ్చింది నాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి అతనే నా సూపర్ హీరో ఆయనతో పాటుగా విజయ్ దేవరకొండ కూడా అంటూ సమాధానం చెప్పింది. సమంత నుండి వీరిద్దరి పేర్లు వచ్చేసరికి అభిమానులు అవాక్కయ్యారు. సమంత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.