హైదరాబాదుకు గుడ్ బై చెప్పేస్తున్న సమంత..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈమధ్య కాలంలో మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే. అలాంటి సమయంలో కూడా యశోద సినిమాతో మెప్పించింది. అంతేకాకుండా ఈమె ఈ మధ్యనే ఆ వ్యాధి నుండి కోలుకొని సినిమాల వైపు దృష్టి కొనసాగిస్తోంది సమంత.టాలీవుడ్ లో క్యూట్ జంటగా పేరు పొందిన సమంత, నాగచైతన్య విడిపోతున్నామంటూ ప్రకటించటంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. అయితే వారిద్దరూ ఎందుకు విడిపోయారని కారణం మాత్రం ఇప్పటివరకు తెలియటం లేదు. గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఉండే ఇంటిని కూడా సమంత కొనుగోలు చేసినట్లు నటుడు మురళీమోహన్ చెప్పారు.

Samantha breaks down in front of media [Video]

ప్రస్తుతం సిటాడేల్ షూటింగ్ కారణంగా ఆమె ముంబైలో ఉన్నట్లు సమాచారం. అయితే సమంత ఈ షూటింగ్ కోసం ముంబైలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుండటంతో అక్కడ ఒక ఇంటిని కొనుగోలు చేయాలని ఆమె భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో రూ .15 కోట్ల విలువైన విలాసవంతమైన ప్లాట్లు చూశారని దాన్నే కొనుగోలు చేయాలని ఆమె అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆమె స్పందించలేదు. అయితే గతంలోనూ ఆమెపై ఇటువంటి వార్తలే వచ్చాయి. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె ముంబైకి మకాం మార్చాలనుకుంటోందని వార్తలు రాగా హైదరాబాదులో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తనకు ఇక్కడి నుండి వెళ్ళనని చెప్పకనే చెప్పారు.

ఇక సమంత యశోద సినిమా కంటే ముందే శాకుంతలం సినిమా చేసింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈనెల 17న విడుదల కావాల్సి ఉంది. కానీ అది కాస్త వాయిదా పడిందనీ తెలుస్తోంది.ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందో మేకర్స్ వెల్లడించలేదు. దీంతో మిగతా షూటింగులపై దృష్టి పెట్టింది సమంత. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ఖుషి షూటింగ్లో పాల్గొనడంతోపాటు హిందీ వెబ్ సిరీస్ సిటాడేల్ లో వరుణ్ ధావన్ పక్కన సందడి చేయనున్నారు.

Share.