Samantha..టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేర్కొంటుంది సమంత(Samantha ) ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ ఉంటోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా కార్యక్రమాలను సౌత్ నార్త్ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత మయోసైటీస్ వ్యాధిని ఎదుర్కోవడం వ్యక్తిగత విషయాల గురించి తెలియజేసింది .తాజాగా తన విడాకులపై మరొకసారి స్పందించింది సమంత.. వైవాహిక బంధం లో తను పూర్తిగా నిజాయితీగా ఉండాలని కాకపోతే అది వర్కౌట్ కాలేదని తెలిపింది..
అంతేకాకుండా పుష్ప లో తాను చేసిన స్పెషల్ సాంగ్ గురించి కూడా ప్రస్తావించింది సమంత.విడాకులు తీసుకున్న కొద్దిరోజులకి తనకు పుష్ప సినిమాలో ఊ అంటావా ఆఫర్ వచ్చిందని.. తాను తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలనిపించింది అందుకే ఆ సాంగ్కు ఓకే చేశానని తెలిపింది సమంత. ఆ సాంగ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఇంట్లో కూర్చో చాలు విడిపోయిన వెంటనే నువ్వు ఐటెం సాంగ్స్ చేయడం బాగోలేదని సలహా ఇచ్చారట. తనని ఎప్పుడు ప్రోత్సహించే స్నేహితుడు సైతం ఆ సాంగ్ అసలు చేయొద్దని చెప్పారట
కానీ వారి మాటలు పట్టించుకోకుండా ఆ సాంగ్ చేశానని తెలిపింది వైవాహిక బంధం లో నేను 100% నిజాయితీగా ఉన్నాను కాకపోతే అది వర్కౌట్ కాలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసినట్టు ఎందుకు దాక్కోవాలి నేను చేయని నేరానికి నన్ను హింసించుకొని ఎందుకు బాధపడాలి అంటూ సమంత తెలియజేసింది. మయోసైటిస్ మెడిసిన్ కారణంగా నాపైన నాకే కంట్రోల్ లేకుండా పోయింది దాని వల్ల ఒకసారిగా నేను నిరసించానని తెలిపింది.
మరొకసారి బొద్దుగా కనిపిస్తాను నేను స్టైల్ కోసం కళ్లద్దాలు పెట్టుకుంటున్నాను అని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెలుతురిని నా కళ్ళు తట్టుకోలేవు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏనటికి రాకూడదు.. గడిచిన ఎనిమిది నెలల నుంచి ప్రతి రోజు నేను పోరాటం చేస్తూనే ఉన్నాను ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నాను ఇలా అన్నిటిని దాటుకొని ఈ స్థాయికి వచ్చాను కాబట్టే ఇప్పుడు ఎవరైనా సరే నా లుక్స్ గురించి కామెంట్ చేసిన పట్టించుకోను ఎన్నో పోరాటాలు చేశాను ప్రస్తుతం శారీరకంగా బాగున్నాను తన పైన వచ్చే ఆధ్యాత్మికంగా ప్రతి మాటను కూడా నేను స్వీకరించేలా చేసింది అని తెలిపింది సమంత.