సమంత విడాకుల వ్యవహారం తర్వాత సినిమాలలో మరింతగా బిజీ అయిపోయింది. విడాకుల బాధ నుంచి కోలుకోవడానికి ఆమె కూడా సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంతకు విడాకుల తర్వాత వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక ఈమె అరేంజ్మెంట్ ఆఫ్ లవ్ ఈ సినిమాతో హాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సమంత తానే స్వయంగా ప్రకటించింది.
అలాగే సమంత తాప్సీ పన్ను నిర్మాణంలో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఆ ప్రాజెక్ట్ టీమ్ తాప్సీ పన్ను, సిద్దార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో ఓ ఈవెంట్‌లో పాల్గోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఒక సరదా చిట్ చాట్ లో పాల్గొనగా.. అందులో 2021 ఎలా గడిచిందో ఒక్క మాటలో చెప్పాలని కోరగా.. సమంత నా జీవితంలో 2021లో క్లిష్టమైన ఏడాది అని చెప్పుకొచ్చింది.