ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు చేరువుగా ఉన్న వ్యక్తి వేణు స్వామి..ఈయన చెప్పింది చెప్పినట్లు జరుగుతున్నాయని చాలామంది సెలబ్రిటీలు ఈయనతో పూజలు చేయిస్తున్నారు.అంతే కాకుండా నాగచైతన్య సమంత విడిపోతారన్న సంగతి ముందుగానే చెప్పి షాక్ ఇచ్చారు..అంతే కాకుండా తారకరత్న చనిపోతాడని ముందుగా చెప్పింది కూడా వేణు స్వామి.. ఒక్క సెలబ్రిటీలకే కాదు రాజకీయాలు వ్యక్తులకు కూడా ఈయన జాతకాలు చెప్పి వాటిలో ఏమైనా దోషాలు ఉంటే పరిష్కారాలు చేసేది ఈయనే.. అయితే ఇప్పుడు ఈయనతో పూజలు చేయించుకోటానికి సమంత కూడా సిద్ధమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.అది నిజమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టార్ హీరోయిన్ సమంత,నయనతార,ప్రభాస్ వీరికి వేణు స్వామి చెప్పింది చెప్పినట్లు జరిగాయని ఇండస్ట్రీలో టాక్ .. దీంతో కొంతమంది నటీమణులు ఇయన చేతి నుండి పూజలు చేయించుకుని కెరీర్ పరంగా మంచి పొజిషన్లో ఉన్నవారు. ఈ మధ్యకాలంలోనే స్టార్ పొజిషన్లో ఉన్న రష్మిక వేణు స్వామి తో పూజలు చేయించుకోని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మరొక హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఇలాంటి పూజలు నిర్వహించింది.
అయితే ఈ లిస్టులోకి రాబోతోంది సమంత అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న రిలీజ్ అయిన శాకుంతలం సినిమా ఫ్లాప్ కావడంతో సమంత నీ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్క శాకుంతలం సినిమానే కాదు ఈమధ్య సమంత తీసిన సినిమాలన్నీ యావరేజ్ గానే ఉన్నాయి.అందుకని సమంత పూర్వపు వైభవం రావాలని వేణు స్వామితో పూజలు చేయాలనుకుంటుందట..
ఇలాగైనా సరే సమంత లైఫ్ టర్న్ కావాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.