Samantha..తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లలో సమంత(Samantha) కూడ ఒకరు. ఈమెకి ఈమధ్య కాలంలో ఆఫర్ల వెలుబడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా సమంత సినిమాలన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హీట్లను సాధిస్తున్నదనే చెప్పాలి. అయితే సమంత కొన్ని నెలల క్రితం వరకు మాజా యాడ్ లో కనిపించేవారు. ఈ యాడ్ ద్వారా సమంతాకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. అయితే ఇప్పుడు ఈ యాడ్ కి నాగార్జున మరియు పూజ హెగ్డే కనిపిస్తున్నారు.
అంటే సమంతకు నాగ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్ ద్వారా సమంతపై నాగార్జునకు ఉన్న పగను తీర్చుకున్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు వరస సినిమాలు వస్తున్న అవన్నీ ప్లాపులను మూటకట్టుకుంటున్నాయి. నాగార్జున అయితే ఇప్పుడు కథల ఎంపికల రూటు మార్చాడు. తెలుగు నేటివిటీ కథలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
అయితే ఇప్పుడు ప్రసన్న కుమార్ బెజవాడ కాంబినేషన్లో ఒక సినిమాను నాగార్జునతో తెరకెక్కిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం. అయితే నాగార్జున ఈ సినిమాకీ రూ.10 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.. అప్పటి హీరోలలో ఇప్పుడు ట్రెండ్ గా ఉన్న హీరో నాగార్జున కాబట్టి మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నారు.
అలాగే నాగార్జున అఖిల్ మరియు నాగచైతన్య కలిసి సినిమా చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. మళ్లీ వీరందరీ కాంబినేషన్లో ఎప్పుడు సినిమాలు వస్తాయో చూడాలి మరి.ఈ విషయంలో నాగార్జున జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సినిమాల పరంగా ముందుకు సాగాలని అలాగే వివాదాలకు నాగార్జున దూరంగా ఉండాలని ఫాన్స్ మరీ మరీ కోరుకుంటున్నారు.