Samantha: మయాసైటిస్ వ్యాధి నుంచి కోలుకొని ఇటీవలే వర్క్ లోకి అడుగు పెట్టింది సమంత (Samantha). ప్రస్తుతం సమంత ఒకపక్క సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే మరొక పక్క పలు సినిమాల ప్రమోషన్స్ లో కూడా బిజీగా ఉంటోంది. తెలుగులో విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొనగా బాలీవుడ్ లో వరన్ ధావన్ తో సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇక సమంత మెయిన్ క్యారెక్టర్ లో నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్నది.
పురాణాలలోని దుష్యంతుడు, శకుంతల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. శాకుంతలం సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.శాకుంతలం సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తూ ఉండడంతో ముంబైలో కూడా సమంత భారీ గానే ఈ సినిమాని ప్రమోషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా వరుసగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతోంది సమంత.
శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత మా శ్రమ టాలెంట్ చూసి ఇంత రెమ్యూనరేషన్ ఇస్తామని నిర్మాతలే చెప్పాలి నేను నాకింత రెమ్యూనరేషన్ ఇవ్వాలని అసలు అడగడం అలా అడుక్కోవలసిన అవసరం తనకు లేదని హీరోయిన్స్ కి నిర్మాతలు రెమ్యూనరేషన్ వాళ్లకు తగినంత ఇవ్వాలని తెలియజేస్తోంది.. ఇక దానికే తగ్గట్టుగా మేము కూడా కష్టపడతాము మా దగ్గర కూడా టాలెంట్ ఉంది.. కష్టపడితే రెమ్యూనరేషన్ వాళ్ళే ఇస్తారు అంటూ తెలియజేసింది సమంత.
ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కొంతమంది ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ ఉండగా మరి కొంతమంది అడగకుండానే ఎవరు ఇస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సమంత ఎక్కువగా ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనే నటిస్తోంది.