డైరెక్టర్ గుణశేఖర్, దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ చిత్రంలో సమంత కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజున విడుదల చేయడం జరిగింది. సమంత గడచిన కొన్ని నెలల నుంచి మయోసైటిస్ కారణంగా మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఈ రోజున పాల్గొనడంతో పూర్తిగా ఎమోషనల్ అయ్యినట్లు కనిపిస్తోంది. సమంత ఇక శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.
సమంత మాట్లాడుతూ చాలా రోజులుగా ఈ టైం కోసం ఎదురు చూశాను శాకుంతలం తన మనసుకు చాలా దగ్గరైన సినిమాఅని ..గుణశేఖర్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని తెలిపింది. ఆయన కష్టాన్ని చూసి ఓపిక తెచ్చుకొని ఇక్కడి వరకు వచ్చానని తెలియజేసింది. కొంతమందికి సినిమా వాళ్ళ జీవితం లో భాగంగా ఉంటుందనీ గుణశేఖర్ గారికి సినిమానే జీవితమని తెలిపింది. కథ వినగానే సినిమా ఎలా తీస్తారు అన్న డౌట్ వచ్చింది.. కానీ మన ఊహకు దాటి సినిమా కొన్నిసార్లు జరిగిందని శాకుంతలం సినిమా చూశాకే తనకు అర్థమైందని తెలుపుతోంది.
సినిమాను నేను ఎంతగానో ప్రేమిస్తానో ..సినిమా కూడా నన్ను అంతగా ప్రేమిస్తోంది ..ఈ సినిమాతో మీ ప్రేమ ఇంకా పెరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేసింది. వేదిక మీద మాట్లాడుతున్న సమయంలో ఆమె ఫ్యాన్స్ అరిచి గోల చేశారు ఈ విధంగా అనారోగ్యంతో ఉన్న సమంత ఫ్యాన్స్ ఇచ్చిన బూస్టింగ్ కి ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.