ఆ విషయంలో నన్ను నేను ప్రశ్నించుకుంటాను:సమంత

Google+ Pinterest LinkedIn Tumblr +

నాగచైతన్య తో విడాకులు తరువాత సమంత ఆ విషయాన్ని మర్చిపోయి పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి స్నేహితులతో కలిసి గుళ్ళూ, గోపురాలు సందర్శిస్తూ, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అంతేకాకుండా మరికొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇప్పటికే ఆమె శాకుంతలం సినిమాలో నటించగా, తమిళంలో విజయ్ సేతుపతి కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈమె బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాలపై ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది సమంత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తాను. నాకు కూడా అక్కడ సినిమాలు చేయాలని ఆసక్తి గా ఉంది అని సమంత తెలిపింది. అలాగే ఒక ప్రాజెక్టు ఓకే చేయాలంటే భాష అనేది సమస్య కాదు. కథలో జీవం ఉందా లేదా? అలాగే ఆ కథకు నేను సెట్ అవుతానా?పాత్రకు న్యాయం చేయగలనా? అలా ఏదైనా ఒక ప్రాజెక్టు ఓకే చేసే ముందు ఇలా నన్ను నేను ప్రశ్నించుకుంటాను అని సమంత చెప్పుకొచ్చింది.

Share.