Samantha: నేటిజన్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన సమంత..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Samnatha..టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ సమంత(Samantha )గురించి చెప్పాల్సిన పనిలేదు.. సమంత కి అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు అంతటి అభిమానులను దక్కించుకుంది సమంత. ఇప్పుడు శాకుంతలం సినిమా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిచారు .ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతున్నది.. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

Samantha wears gold, diamonds worth Rs….

ఇందులో సామ్ శాకుంతల పాత్రలో నటించగా మలయాళం నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ ,టీజర్ పోస్టర్స్ విడుదలై క్యూరియాసిటీని పెంచాయి. ఈ సినిమాలో మధుబాల ,ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలక మైన పాత్రలో నటించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ బాలనటిగా చేయబోతోంది.

అయితే తాజాగా ఓ నేటిజన్ సమంత పాల్గొన్న ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ… ఎవరితోనైనా డేటింగ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇది చూసిన సమంత అతడికి ఫన్నీ రియాక్షన్ ఇచ్చింది. నాకు తెలుసు అది నా స్థానం కాదని… కానీ ప్లీజ్ ఎవరితోనైనా మీరు డేటింగ్ చేయండి అంటూ సదరు నేటిజన్ ట్విట్ చేయగా.. సమంత స్పందిస్తూ మీలాగే నన్ను ఎవరు ప్రేమిస్తారు. అంటూ హార్డ్ సింబల్ షేర్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

సమంత నేటిజన్ అలా అన్న మాటకి సీరియస్ అవుతుందనుకుంటే చాలా సింపుల్ గా హార్డ్ సింబల్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది సమంత. ఇప్పుడు సమంత చేతిలో వరుస పెట్టి సినిమాలలో నటిస్తోంది. అందులో సిటడేల్ ,ఖుషి చిత్రాలు ఉన్నాయి. శాకుంతలం సినిమా ఎంత విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఆకాల్సిందే.

Share.