టాలీవుడ్ లో హీరోయిన్ సమంతకు సంబంధించి ఎలాంటి విషయమైనా సరే క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటుంది.. ముఖ్యంగా విడాకుల వ్యవహారం నుంచి ఈమెకు సంబంధించి ఎలాంటి విషయమైనా సరే హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. తాజాగా సమంత ఒక హీరో పై మోజు పడుతోందంటు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో పై ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.
కొంతమందికి డబ్బు మీద, మరి కొంతమందికి వస్తువుల మీద ,మనసుల మీద ,ఇలా పెంపుడు జంతువుల మీద కూడా పలు రకాలుగా కోరికలు ఉంటాయి. తాజాగా సమంత ఒక స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట. ఆయన ఎవరో కాదు మలయాళం లో స్టార్ హీరోగా పేరుపొందిన ఫహద్ ఫాజిల్.. ఈయన పేరు చెప్పగానే మనకి పుష్ప సినిమాల విలన్ అనే క్యారెక్టర్ గుర్తుకువస్తుంది.
మలయాళం నటుడు అయినప్పటికీ సమంతకి ఈయన అంటే చాలా ఇష్టం. ఒకవేళ మలయాళంలో స్ట్రైట్ మూవీ చేస్తే కనుక కచ్చితంగా ఈ హీరోతో చేస్తానని సమంత తెలియజేస్తోంది.. సమంత కి ఫహద్ ఫాజిల్ హీరోగా నటించే సినిమాలలో నటించాలని ఒక డ్రీమ్ కూడా ఉందని తెలియజేసింది. ప్రస్తుతం సమంత తనలో ఉన్న కోరికను బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఫహద్ ఫాజిల్, హీరోయిన్ నజ్రియా ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా జన్మించారు.. ఈ విషయం తెలిసిన సమంత హేటర్స్ కొంతమంది వివాహమైన హీరో అంటే సమంతకు అంత ఇష్టమా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయడం జరుగుతోంది.