చైతూ పైన ఇన్ డైరెక్టుగా సెటైర్లు వేసిన సమంత..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీలోకి ఏంమాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు వారికి పరిచయమైంది సమంత ఇక ఈ సినిమాలో హీరోగా నటించింది.నాగచైతన్య ఈ విషయం మనందరికీ తెలుసు అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ఎవరికీ తెలియకుండా రహస్యంగా వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తరువాత మంచి సమయం చూసుకొని కుటుంబ సభ్యులకు చెప్పి వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా ఒకవైపు హిందూ సాంప్రదాయ పద్ధతిలో మరోవైపు క్రిస్టియన్స్ పద్ధతిలో వీరిద్దరి వివాహం జరిగింది..

ఇక వీరిద్దరికీ పెళ్లి అయిన తర్వాత వీరికి ఒక క్యూట్ కపుల్ అనే బిరుదు కూడా వచ్చింది. పెళ్లి తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది. ఇక సమంత నాగచైతన్య ఏదైనా ఒక ఈవెంట్లో చూసిన చూడముచ్చటగా కనిపిస్తారు.

కానీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే వీరిద్దరూ కనిపించలేదో అప్పటినుంచి జనాల్లో అనుమానాలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోతారా అనే డౌట్ చాలామందికి వచ్చాయి. ఇలా అన్నారో లేదో ఇలా విడిపోయారు.అనే వార్త వచ్చింది.
కానీ వారు ఎందుకు విడిపోయారు అనే కారణం తెలియదు కానీ అభిమానులు మాత్రం మళ్లీ కలుసుకుంటారేమో అన్నట్లు ఆలోచిస్తున్నారు. కానీ వారి మాటలు వారి ప్రవర్తన పట్టి చూస్తే వీరు కలిసేలా కనిపించలేదు. అయితే చాలామంది సమంతదే తప్పు అన్నట్టుగా భావిస్తున్నారు.కానీ ఈ మాటలకు ఎప్పటికప్పుడు సమంత సీరియస్ గా వార్నింగ్లు ఇస్తూ కనిపిస్తోంది.

కానీ ఈ మధ్యకాలంలోనే సమంతా కి ఒక వ్యాధితొ బాధపడుతోందన్న సంగతి మనకు తెలుసు అయితే అదే సమయంలో తాను నటించిన యశోద సినిమా పెద్ద సక్సెస్ను సాధించి పెట్టింది.ఈ ప్రమోషన్స్లో సమంత నాగచైతన్య గురించి కొన్ని కామెంట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ యూట్యూబ్ ఛానల్ కి సమంత ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ చానల్లో తన గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. లైఫ్ లో మనము ఏదైనా సాధించటానికి ఎంత కష్టాన్నయినా పడాలి. మనకు నచ్చినట్టు బతకాలి ఎవరినో సుఖపెట్టటానికి కాదు. మనం పుట్టింది అంటూ షాకింగ్ కామెంట్లను చేసింది.

అంతేకాకుండా ఒకరు కింద అనిగిమనిగి ఉండాల్సిన అవసరం మనకు లేదు. దేనికైనా ఎదిరించి ముందుకు అడుగు వేయాలి. అప్పుడే మనం లైఫ్ లో ఏమైనా సాధిస్తాం ముందుకు వెళ్లగలుగుతాం. ఆమె చెప్పిన ఈ మాటలన్నీ నాగచైతన్యకి ఉద్దేశించి అని కొందరు అనుకుంటున్నారు.

Share.