Samanta..తెలుగు సినీ ప్రపంచంలో ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్నది హీరోయిన్ సమంత(Samantha). ఈమె ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో బాధపడి కోలుకున్న విషయం తెలిసిందే . సమంత తెలియక చేస్తుందో తెలిసి చేస్తుందో తెలియదు కానీ నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె పెట్టే ప్రతి పోస్ట్ పరోక్షకంగా అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేసేలా ఉంటున్నాయి. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత గోవా ట్రిప్ వేసుకొని అక్కడ జీన్స్ మోడరన్ డ్రెస్సుల్లో కనిపించే సమంత ఒక్కసారిగా టు పీస్ బికినీలో దర్శనమిచ్చింది.
ఇలాంటి డ్రెస్ వేసుకోవడం పట్ల అక్కినేని అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.అంతేకాకుండా సమంత విడాకులు తీసుకున్న తర్వాత నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటుపోతోంది. ఇప్పటికే మూడు బడా ప్రాజెక్టులకు సైన్ చేసింది సమంత. రీసెంట్ గానే యశోద సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది. సమంత విడాకులు తీసుకున్న తరువాత నాగచైతన్య గురించి కానీ అక్కినేని ఫ్యామిలీ గురించి కానీ ఎక్కడ మాట్లాడటం లేదు.
ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ పరోక్షకంగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది కానీ.. డైరెక్టుగా ఎక్కడ మాట్లాడటం లేదు.అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది. అదేమిటంటే నాగార్జున ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా సమంత కాల్ లిఫ్ట్ చేయలేదట.
సమంత పక్కనే ఉన్న సామ్ ఫ్రెండ్ (టాలీవుడ్ హీరో) మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చుగా అని చెప్పగా.. సమంత నాగార్జున గురించి ఇలా అందట… ఇంట్లో ఆయనకు అంత సీను లేదు. భార్య చెప్పిందే వింటాడు ఆయనతో మాట్లాడి టైం వేస్ట్ అంటూ చెప్పిందట. అయితే ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. దీన్ని బట్టి చూస్తే ఇంట్లో అమలాదే పైచేయని తెలుస్తోంది.