స్నేహరెడ్డి పై హాట్ కామెంట్స్ చేసిన సమంత?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్నేహారెడ్డి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అల్లు అర్హ, అల్లు అయాన్ చేసే అల్లరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మల్హోత్ర డిజైన్ చేసిన నలుపు రంగు చీరలో దిగిన ఫోటోలను స్నేహ షేర్ చేసింది. సమంతా స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్ స్నేహా కి స్టైలింగ్ చేసారు. స్నేహారెడ్డి ఫోటోలపై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంతా కూడా స్నేహ రెడ్డి ఫోటో పై కామెంట్ చేసింది. హాట్ అంటూ స్నేహా రెడ్డి ఫోటో కి సమంత కామెంట్ చేయగా ఆ స్క్రీన్ షాట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్నేహ రెడ్డి బ్లాక్ కలర్ సారీ లో మరింత అందంగా కనిపిస్తోంది.

Share.