సమంత సినిమాలో ఛాన్స్ కొట్టేసిన వరలక్ష్మీ శరత్ కుమార్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సమంత విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీ గా వున్న విషయం తెలిసిందే. అయితే ఆమె విడాకులు కంటే ముందు శాకుంతలం సినిమాలో నటించడం మొదలుపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని , ఇప్పుడు శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై మరొక సినిమా చేస్తోంది.శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. దీనికి ‘యశోద’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వీరిద్దరూ కొత్త దర్శకులు అయినప్పటికీ.. వారు కథ చెప్పిన వెంటనే సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందించడానికి దర్శకులు ఈ కథ రాసుకున్నారు అని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరో ఉండరట.. హీరో, హీరోయిన్ ఆమెనే కావడం గమనార్హం. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం కోలీవుడ్ బ్యూటీ అయినా వరలక్ష్మి శరత్ కుమార్ తీసుకున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ నిర్వహించి వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకి సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక సమ్మర్ లో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

Share.