టాలీవుడ్ లో బెస్ట్ పెయిర్ అంటే హీరోయిన్ సమంత, అక్కినేని నాగ చైతన్య అని అనేవారు. అయితే విడాకులు తీసుకున్నాక ఎవరికి వారు వారి షెడ్యూల్స్‌లో బిజీగా మారిపోయారు. కానీ వీరిద్దరు విడాకులు తీసుకోవడాన్ని మాత్రం అభిమానులకు నచ్చలేదు. రీసెంట్ గా నాగచైతన్య పుట్టినరోజు కావడంతో చాలా మంది సినీ ప్రముఖులు చైతూ కి బర్త్‌డే విషెష్ తెలియచేశారు. కానీ సమంత మాత్రం చైకి ఎలాంటి విషెష్ తెలపలేదు.
అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. సమంత ఈ రోజు చేసిన పనికి నెటిజన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. తన పెంపుడు కుక్క “హాష్”కు బర్త్‌డే విషెస్ తెలియజేసింది సమంత, దానితో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కొన్ని స్టోరీస్‌లను, కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే పెంపుడు కుక్కకు అంత ప్రాధాన్యత ఇచ్చి బర్త్ డే విషెష్ తెలిపినప్పడు, మాజీ భర్త చై కోసం కనీసం ఒక్క పోస్ట్ పెట్టలేకపోయావా అని సమంతను నెటిజన్లు నిలదీస్తున్నారు? కనీసం స్నేహితురాలిగానైనా విష్ చేయాల్సిందని అంటున్నారు. ఈ విషయంపై నాగచైతన్య ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే