సాధారణంగా ఇండస్ట్రీలో ప్రతి హీరోయిన్ కానీ హీరోలకు కానీ మేనేజర్లు కంపల్సరీ ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే ..సెలబ్రిటీలకు సినిమా అవకాశాలు రావాలన్న వారి కాల్ షీట్స్ చూసుకోవాలన్న వారి ఆర్థిక లావాదేవీలు అన్నింటిని మేనేజర్లదే ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అయితే ఇదే అదనంగా భావించి కొంతమంది సెలబ్రిటీలను మేనేజర్లు మోసం చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలతో డబ్బు పోగు చేసుకుంటూ చాలామంది మేనేజర్లు సెటిల్ కూడా అయ్యారు.
అయితే తాజాగా నటి సమంత కూడా మేనేజర్ చేతిలో మోసపోయిందని తెలుస్తోంది. అలాగే మావోసైటిస్ వ్యాధితో సతమతమవుతున్నటువంటి సమంతకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అదేంటంటే సమంత వద్ద ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నటువంటి మేనేజర్ ఆమె వద్ద ఏకంగా కోటి రూపాయలు నొక్కేయటానికి భారీగానే స్కెచ్ వేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే సమంత ఖుషి సినిమా తర్వాత సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలుసు
అయితే ఈ సినిమా కారణంగా తాను ప్రమోషన్లకు రాకపోవడం అలాగే తన ఆరోగ్యం బాగాలేనప్పుడు సినిమా షూటింగ్ వాయిదా పడటం వల్ల నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడ్డారన్న విషయాన్ని దృష్టిలో తీసుకున్నటువంటి సమంత కోటి రూపాయల రెమ్యూనరేషన్ వెనక్కి తిరిగి ఇవ్వమని తన మేనేజర్ కి సూచించారట. అయితే సమంత ఆరోగ్య సమస్యతో శతమతమవుతున్న నేపథ్యంలో పెద్దగా ఆ కోటి రూపాయల గురించి పట్టించుకోలేదని భావించినటువంటి మేనేజర్ ఆ కోటి రూపాయలు నొక్కేసే ప్రయత్నం చేశారు.
అయితే నిర్మాతల వద్ద సమంత మేనేజర్ పూర్తి రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా ఆ కోటి రూపాయలను లిక్విడ్ క్యాష్ రూపంలో కావాలని చెప్పారట. అయితే నిర్మాత లిక్విడ్ క్యాష్ ఇవ్వలేమని చెప్పటంతో సదరు మేనేజర్ తన ఫ్రెండ్స్ అకౌంట్ నెంబర్ ను ఇవ్వటంతో అనుమానం వచ్చి నిర్మాతలు సమంతను సంప్రదించటంతో ఆయన మోసం బయటపడింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే సమంత స్పందించాల్సిందే