అక్కినేని వారి కోడలు సమంత మల్టీటాలెంటెడ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామ్ ప్రజెంట్ సినిమాలు, సిరీస్‌లు, బిజినెస్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తోంది. ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదలైంది. సామ్ నటనకుగాను ప్రశంసలు లభించాయి. కాగా త్వరలోనే సామ్ కల నెరవేరబోతున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా సామ్ గోవాలో ఓ మంచి ప్లేస్ కొనుక్కోవాలని చూస్తోందట. కాగా తాజాగా ఓ మంచి స్పాట్‌ను కనుగొన్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్.
ఇక అక్కడ ఈ జంట ఫామ్‌హౌస్‌ను నిర్మించుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. చై-సామ్ జంటకు గోవాలోనే వివాహం జరిగినందున అక్కడే ఫామ్ హౌజ్ కట్టుకోవాలని సామ్ భావిస్తుందట. చాలా సార్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో సామ్ గోవాలోనే నివసించాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఈ క్రమంలోనే సామ్ అక్కడ ఫామ్ హౌజ్ కన్ స్ట్రక్ట్ చేయాలనుకుంటోంది కావచ్చు. సమంత ప్రజెంట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘శాకుంతలం’లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.