అక్కినేని సమంత ఓ స్వీట్ హాట్ న్యూస్ను హింట్ గా ఇచ్చింది అక్కినేని ఫ్యామిలికి, అక్కినేని అభిమానులకు. సమంత ఇచ్చిన హింట్ ఇప్పుడు టాలీవుడ్లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకు సమంత నర్మగర్భంగా చెప్పిన ఈ హింట్ నిజమేనా… లేక కావాలని సమంత దాస్తుందా..? అనేది త్వరలో తేలనుంది. ఇంతకు సమంత అక్కినేని కుటుంబానికి ఇచ్చిన హింట్ ఏంటనే కదా అందరి అతృత. అక్కడికే వస్తున్నానండి…
అక్కినేని సమంత నాగచైతన్యతో ఏమాయ చేసావే సినిమాతో జత కట్టింది. అప్పటి నుంచి వీరి ప్రయాణంలో ఇద్దరి నడుమ ప్రేమ చిగురించి, పెళ్ళి పీటల ఎక్కింది. వీరి మజిలి ఇప్పుడు సాఫీగానే సాగుతుంది. అయితే ఇటీవల అక్కినేని సమంతపై ఓ ప్రచారం జోరుగా సాగుతుంది. అదేనండి… సమంత ఇప్పుడు తల్లి కాబోతుంది అనే వార్త హల్చల్ చేస్తుంది. ఈ వార్తకు సమంత ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో ఖండించింది. తాను ప్రెగ్నేన్సీ కాదని అది కేవలం రూమర్ అని కొట్టిపారేసింది.
అక్కినేని సమంత మీడియాతో మాట్లాడుతూ వార్తలకు చెక్ పెట్టిందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తాను ప్రెగ్నేన్సీ కాదు అంటునే చైతు 100శాతం మంచి నాన్న అవుతాడు అంటుంది. అంటే సమంత తల్లి కాకుండా మంచి తండ్రి ఎలా అవుతాడు నాగచైతన్య అనేది అనుమానం. మంచి భర్తగా ఉన్న నాగచైతన్య మంచి తండ్రి కావాలంటే సమంత ప్రెగ్నేన్సీ అన్నట్లే కదా అనేది ఇప్పుడు అందరి మదిలో మొదులుతున్న ప్రశ్న. సో సమంత తాను ప్రెగ్నేన్సీ అని చెప్పకనే చెప్పిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ఛల్ చేస్తోంది. సమంత చెప్పినట్లు నాగచైతన్య మంచి తండ్రి ఎప్పుడు అవుతాడో అది కూడా సమంతే చెప్పాలి.