సమంత కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సమంత ప్రస్తుతం వరుస సినిమాలను ఒప్పుకుంటుంది. దీంతో చాలా బిజీగా ఉన్నది. అయితే తాజాగా సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకి టైటిల్ యశోద అని ఖరారు చేసినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ రోజున ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. ఫ్యామిలీ మాన్-2 వెబ్ సిరీస్ లో సమంత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.


ఈ సినిమాని తెలుగు,తమిళ, కన్నడ మలయాళం తో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమా అని తెలియజేశాడు. బాలకృష్ణతో ఆదిత్య 369, నానితో జెంటిల్ మాన్, సుధీర్ బాబు సమ్మోహనం వంటి సినిమాలను నిర్మించాను ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో ఈ సినిమా చేస్తుండడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఉద్దేశంతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని తెలియజేశారు.

Share.